గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం.

గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం.

వేలేరు, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళా బృందం ఆదివారం రాత్రి వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండతండా గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది.రాత్రి 7.00 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత గంజాయి, డ్రగ్స్‌, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే 8712584473 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అలాగే విద్య ప్రాధాన్యత, రోడ్డు భద్రత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, డయల్-100 సేవలు, సీసీటీవీ కెమెరాల ఉపయోగం, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన తదితర అంశాలపై పాటలు, మ్యాజిక్ షో ద్వారా అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల కలిగే నష్టాలపై నాటికల ద్వారా వివరించి, సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వేలేరు ఎస్సై సురేష్, గ్రామ సర్పంచ్ మాలోతు అరుణ, మహిళా ఏఎస్ఐ నాగమణి, హెడ్ కానిస్టేబుళ్లు విలియం, రత్నయ్య, పూల్ సింగ్, శ్రీనివాస్, నారాయణ, విక్రమ్ రాజు, చిరంజీవి, ఇతర పోలీసు సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.IMG-20260601-WA0090

Tags:

Post Your Comments

Comments

Latest News

గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం. గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం.
వేలేరు, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు): వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళా బృందం ఆదివారం రాత్రి...
భీమదేవరపల్లిలో బెల్ట్ షాపుల నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం.
గ్రామాభివృద్ధే లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ చంద్రశేఖర్ శ్రీకారం
రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు.. అనుమానితులపై పోలీసుల ప్రత్యేక నిఘా.
విద్యార్థుల సర్టిఫికెట్ల జాప్యంపై ఆందోళన.. తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం.
పొదుపు మనిషికి ఆర్థిక స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని అందిస్తుంది.
రైతుల రాకపోకలకు ఆటంకం వద్దు.. అధికారులకు మున్సిపల్ చైర్మన్ సూచన.