దేవరకద్రలో టీఆర్పీకి భారీ చేరికలు.. పలువురికి కీలక పదవులు.

దేవరకద్రలో టీఆర్పీకి భారీ చేరికలు.. పలువురికి కీలక పదవులు.

దేవరకద్ర,జూన్01(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) బలోపేతానికి దేవరకద్ర నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని నియోజకవర్గ ఇంచార్జ్ మంగరాయి వెంకటేష్ అన్నారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మున్నూరు జయపాల్ మార్గదర్శకంలో దేవరకద్ర నియోజకవర్గ ఇంచార్జ్ మంగరాయి వెంకటేష్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్పీ కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు మున్నూరు జయపాల్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మండల ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడిగా ఏలసరి ఆంజనేయులు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా వెంకటయ్యకు నియామక పత్రాలను అందజేశారు.పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసి, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని నూతనంగా నియమితులైన నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు రవికుమార్, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు నజీర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .