నక్ష బాట సర్వే చేపట్టాలి..స్మశాన వాటిక భూమికి హద్దులు గుర్తించాలి.

సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం.

నక్ష బాట సర్వే చేపట్టాలి..స్మశాన వాటిక భూమికి హద్దులు గుర్తించాలి.

పెద్దమందడి,మే30(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ గట్టు కాలువ నుండి అడ్డాకుల పొలిమేర వరకు ఉన్న నక్ష బాటను సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని పెద్దమందడి తహసీల్దార్‌కు శనివారం వెల్టూర్ గ్రామపంచాయతీ తరఫున గ్రామ సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.గ్రామ ప్రజల అవసరాలు, భూసరిహద్దుల స్పష్టత దృష్ట్యా గట్టు కాలువ నుండి అడ్డాకుల పొలిమేర వరకు ఉన్న నక్ష బాటను సంబంధిత అధికారులు సర్వే చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు.అదేవిధంగా గట్టు కాలువ నుండి తోలబండ వరకు ఉన్న 21వ సర్వే నంబరులోని అసైన్డ్ భూమిని గ్రామ స్మశాన వాటికకు కేటాయించి, ఆ భూమికి హద్దులు గుర్తించాలని తహసీల్దార్‌ను కోరారు.గ్రామాభివృద్ధి, ప్రజల సౌకర్యాల దృష్ట్యా ఈ రెండు అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, గోవర్ధన్ రెడ్డి, ముష్టి శ్రీనివాసులు, వివేక్, యాదయ్య, సత్య రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .