బైక్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.. ఆలస్యంగా ఫిర్యాదు.

జమ్మికుంట టౌన్ మే 16 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామానికి చెందిన గర్రెపల్లి శ్రీనాథ్ తండ్రి సత్యనారాయణ(25), తన తమ్ముడు గర్రెపల్లి ఉదయ్ కిరణ్(24) ప్రమాదానికి గురైనట్లు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. మే 2, 2026న సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఉదయ్ కిరణ్ తన ద్విచక్ర వాహనంపై పనిమీద జమ్మికుంటకు వస్తుండగా, బొమ్మల గుడి వద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుండి సుదర్శన్ అనే వ్యక్తి తన బైక్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి ఢీకొట్టినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఉదయ్ కిరణ్ కిందపడిపోగా కుడి కాలి కింద నరాలు తెగడంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .