జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన పశుపతినాథ్ దేవస్థానం.
Views: 4
On
ఎల్కతుర్తి, మే 12 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపురం గ్రామంలో గల శ్రీ పశుపతినాథ్ దేవస్థానం (శివాలయం)లో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, “జై శ్రీరామ్” నినాదాలతో దేవస్థానం పరిసరాలు మారుమోగాయి.
ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించగా, అభయాంజనేయ స్వామికి మంత్రోచ్ఛారణల నడుమ మన్యసూక్త పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి తెలిపారు. అనంతరం మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
హనుమాన్ జయంతి మంగళవారం రోజున రావడం ఎంతో విశిష్టమైందని, ఈ పవిత్ర దినాన స్వామివారి సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి గీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంజి భావన్ ఋషి, ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి, గ్రామ పెద్దలు, యువ
కులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.
కులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments