జమ్మికుంట యువత ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్‌కు ఘన సన్మానం.
Views: 6
On
జమ్మికుంట టౌన్ మే 10 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందిన ఎస్ఐ సతీష్‌కు జమ్మికుంట యువత ఆదివారం ఘన సన్మానం నిర్వహించింది. ఇటీవల ఆయన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో యువత ప్రత్యేకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ, ఎస్ఐ సతీష్ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేవారని ప్రశంసించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారికి ప్రోత్సాహం అందించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.
మిరుదొడ్డిలో కూడా అదే సేవాభావంతో పనిచేసి మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ యువత ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట యువతకు చెందిన పాతకాల ప్రవీణ్, సింగిరెడ్డి రంజిత్ రెడ్డి, రాజకుమార్, అంబాలా అరుణ్, నాగరాజు, వెంకటేష్, ప్రకాష్ రాజ్, సంతోష్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments