రోడ్డు భద్రతపై ఎల్కతుర్తి పోలీసుల ప్రత్యేక దృష్టి.
Views: 6
On
ఎల్కతుర్తి, మే 09 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న నేషనల్ హైవే రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రత కోసం మళ్లీ మూడు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐ నరసింహారావు తెలిపారు.
గతంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు రహదారి విస్తరణ పనులు, కొత్తగా డాంబర్ వేయడం కారణంగా తొలగించబడిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ స్టేషన్ ముందు వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల తరచూ ప్రమాదాల అవకాశాలు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు వేగ నియంత్రణ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రజలు, పాదచారులు, పోలీస్ స్టేషన్‌కు వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైవేపై ప్రయాణించే వాహనదారులు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో నెమ్మదిగా ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని పోలీసులు సూచించారు. ప్రజలకు ఎ
లాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
లాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments