రాజకీయ పురిటి గడ్డపై తుమ్మల 40 వసంతాల వేడుకలు.
సత్తుపల్లిలో అభిమానుల సంబరాలు.
Views: 3
On
సత్తుపల్లి, మే 8(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ఆయన రాజకీయ పుట్టినిల్లు అయిన సత్తుపల్లిలో “తుమ్మల 40 వసంతాల వేడుకలు” ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం అభిమానులు, కార్యకర్తలు, ప్రజల సందడితో ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభిమాన వారోత్సవాలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, తుమ్మల తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మంత్రి తుమ్మలతో తమ నాలుగు దశాబ్దాల రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏఐ ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చిత్రాలు, వీడియోల రూపంలో ప్రజలకు ప్రదర్శించారు. రహదారుల విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థల అభివృద్ధి, వైద్య రంగంలో చేపట్టిన సేవలను చూపించిన ఈ ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. సత్తుపల్లి తుమ్మల గుండెలో ఉంటుంది అంటూ డాక్టర్ తుమ్మల యుగంధర్ భావోద్వేగంగా మాట్లాడారు. సత్తుపల్లి ప్రజల ప్రేమ, ఆదరణను తుమ్మల ఎప్పటికీ మరచిపోలేరు. ఆయన ఏ పదవిలో ఉన్నా, ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా ఆయన ఆలోచన ఎప్పుడూ సత్తుపల్లి అభివృద్ధిపైనే ఉంటుంది అని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తుమ్మల అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమం మొత్తం తుమ్మల నినాదాలతో మార్మోగింది. రాజకీయాల్లో నిబద్ధత, అభివృద్ధి పట్ల అంకితభావంతో ముందుకు సాగిన తుమ్మల ప్రయాణానికి ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments