జమ్మికుంటలో శానిటేషన్ పనులపై చైర్మన్ క్షేత్ర స్థాయి పరిశీలన.
Views: 3
On
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను పరిశీలించారు. పట్టణంలోని 30 వార్డులకు సంబంధించిన శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిలో మార్పులు చేపడుతూ, అన్ని వార్డులకు సమానంగా సేవలు అందేలా జవాన్లను పునర్వ్యవస్థీకరించినట్లు తెలిపారు.
ప్రత్యేకంగా 5, 8, 23 వార్డులను పరిశీలించిన చైర్మన్, టీమ్ వర్క్ ద్వారా శానిటేషన్ పనులు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు అన్ని విధాలుగా మున్సిపల్ పాలకవర్గం అందుబాటులో ఉంటుందని, శుభ్రత పరిరక్షణలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు యట్ల సునీత అశోక్, కోలుగురి సురేష్, చింతల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 22:32:34
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...


Comments