షార్ట్ సర్క్యూట్ ఘటనపై చురుకైన స్పందన – రైతులకు అండ
Views: 3
On
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం గోపాలపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పంటలు కాలిపోయిన ఘటనపై వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం స్పందించారు. ఘటన స్థలానికి చేరుకుని నష్టపోయిన పంటలను పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రైతుల ఆవేదనను విన్న చైర్మన్, వారికి ధైర్యం చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని వివరించి, నష్టాన్ని అంచనా వేయించి త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువెళ్లి, బాధిత రైతులకు తప్పకుండా నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారి వెంట ఉంటుందని భరోసా ఇస్తూ చైర్మన్ స్వప్న సదానందంవారికి ఆత్మస్థైర్యం నింపారు 

Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 22:32:34
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...


Comments