చేతబడి హడావిడి… నిజం చెబుతున్న డాక్టర్ ప్రభు!
Views: 6
On
జమ్మికుంట టౌన్ మే 04 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి నుండి శ్రీరాములపల్లి, మడిపల్లి వైపు వెళ్లే మూడు దారుల కూడలిలో ఆదివారం అర్ధరాత్రి భూత వైద్యుల చర్యలు వెలుగులోకి వచ్చాయి. స్టార్ ఆకారంలో ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, న్యూస్‌పేపర్‌తో మనిషి ఆకారంలో బొమ్మ తయారు చేసి పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి.
ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ మార్గంలో వెళ్లే ప్రజలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని భావించి సమాచారం అందించగా, డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు భూత వైద్యులను ఆశ్రయించడం దురదృష్టకరమని తెలిపారు. ఇలాంటి అశాస్త్రీయ పద్ధతులకు వేలాది రూపాయలు ఖర్చు చేయడం అజ్ఞానమని విమర్శించారు.
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే కష్టపడి పనిచేయాలని, అనారోగ్య సమస్యలు ఉంటే ఆసుపత్రులకు వెళ్లి వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. మూఢనమ్మకాలకు భయపడకుండా ధైర్యంగా జీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం అక్కడ ఉన్న న్యూస్‌పేపర్ బొమ్మను కాల్చివేసి, నిమ్మకాయలను తొలగించి, ముగ్గు, పసుపు, కుంకుమ ఆనవాళ్లను నీటితో శుభ్రం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments