గుడిసెలు లేని గ్రామాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

గుడిసెలు లేని గ్రామాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు లేని గ్రామాల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.పేద ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెల్లో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, పెద్దమందడి గ్రామ సర్పంచ్ సూర్య గంగ రవి, వివిధ గ్రామాల సర్పంచ్ లు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .