వరద ముప్పుకు ముందస్తు చెక్.. నాయిని చెరువు మత్తడిపై చైర్మన్ ప్రత్యేక దృష్టి
Views: 6
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కీలక చర్యలు చేపట్టారు. పట్టణంలోని నాయిని చెరువు మత్తడిని ఇరిగేషన్ డిఈ, మున్సిపల్ ఏఈలతో కలిసి స్వయంగా సందర్శించి ప్రస్తుత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణం నుంచి భారీగా వచ్చే వరదనీరు చెరువు వద్ద ఎలా ప్రవహిస్తున్నదీ, ఎక్కడ ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో చైర్మన్ సవివరంగా అధ్యయనం చేశారు. ప్రస్తుతం చెరువు నిండిన పరిస్థితుల్లో మత్తడి ప్రవహిస్తున్న సమయంలో పట్టణం నుండి వచ్చే వరదనీరు అదే మార్గంలో కలిసిపోవడం వల్ల నీటి ప్రవాహం మందగించి, చెరువు పరిసర ప్రాంతాల్లోని నివాస గృహాలకు ముప్పు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో చెరువు మత్తడి నీరు మరియు పట్టణ వరదనీరు కలవకుండా వేర్వేరు మార్గాల్లో వెళ్లేలా ప్రత్యేకంగా రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం వల్ల వరదనీరు వేగంగా బయటకు వెళ్లి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారని వివరించారు.
అదేవిధంగా పనులను అత్యవసర ప్రాతిపదికన ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రణాళికను త్వరితగతిన సిద్ధం చేసి వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల భద్రతే ముఖ్యమని, వరద ముప్పును ముందుగానే అరికట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments