నాగిలిగొండ గ్రామంలో విషాదం.

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

నాగిలిగొండ గ్రామంలో విషాదం.

 
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 19(తెలంగాణ ముచ్చట్లు)
 
భానుడి భగభగలకు మరో నిరుపేద ప్రాణం బలయ్యింది. ఎండ తీవ్రత తాళలేక వడదెబ్బతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో విషాదం నింపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిలిగొండ గ్రామానికి చెందిన షేక్ మీరా (42), తండ్రి ఉద్దండ సాహెబ్, వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ. రోజువారీ పనుల్లో భాగంగా ఆదివారం పొలం పనికి వెళ్లిన మీరా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఆయన ప్రాణాలు విడిచారు.
మృతుడు మీరాకు భార్య షమినా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య షమినా కూడా కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తె నసీమా డిగ్రీ చదువుతుండగా, కుమారుడు ఉస్మాన్ తొమ్మిదవ తరగతి చదువుతున్నట్లు సమాచారం. 
నిరుపేద కుటుంబానికి చెందిన మేరా మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వం స్పందించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .