మల్లాపూర్‌లో బస్తీ బాట

_ప్రజా సమస్యలపై నెమలి అనిల్ కుమార్ ప్రత్యక్ష పరిశీలన

మల్లాపూర్‌లో బస్తీ బాట

మల్లాపూర్, ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్‌లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకుడు నెమలి అనిల్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్‌తో కలిసి అన్నపూర్ణ కాలనీ, ఎన్‌టీఆర్ నగర్ కాలనీ, జయశంకర్ కాలనీలను సందర్శించారు. కాలనీల్లో తాగునీటి తక్కువ ఒత్తిడి, సీవరేజ్, డ్రైనేజీ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని నెమలి అనిల్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ జనరల్ సెక్రటరీ తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మక్తాల బాలరాజ్ గౌడ్, ఉండం శ్రీనివాస్, కొయలకొండ రాజేష్, నిక్కీ గౌడ్, లక్ష్మీపతి, సురేష్, అన్వర్ పఠాన్ గారుపాషా, రషీద్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260416-WA0105

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .