అంబేద్కర్ స్పూర్తితో చదువుకోండి – ఎదగండి.
వేంసూరు ఎస్సీ వసతిగృహంలో అంబేద్కర్ జయంతి.
Views: 48
On
సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వేంసూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతిగృహంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వసతిగృహ సంక్షేమ అధికారి డాక్టర్ తిమ్మిడి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. దేశ అభివృద్ధి కోసం ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం పట్ల ఆయన చూపిన మార్గదర్శకత్వాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని వివరించారు. “చదువుకోండి – ఎదగండి” అనే అంబేద్కర్ సందేశాన్ని గుర్తు చేస్తూ, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి వ్యక్తిగా ఎదగాలని సూచించారు
. ఈ కార్యక్రమంలో వసతిగృహ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments