దళిత రత్న అవార్డును అందుకున్న కాజీపేట్ నాయకులు 

దళిత రత్న అవార్డును అందుకున్న కాజీపేట్ నాయకులు 
అవార్డును అందుకుంటున్న నాయకులు

 కాజీపేట్ ఏప్రిల్ 16 ( తెలంగాణ ముచ్చట్లు)

వివిధ రంగాలలో సమాజ సేవ చేస్తున్న కాజీపేట్ ప్రాంతానికి చెందిన దళిత నాయకులు బొడ్డు దేవయ్య, గబ్బెట శ్రీనివాస్, కొడవటి రవి, నీరటి సాయిరాజ్ లకు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత రత్న అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహనీయుల జయంతి సందర్భంగా సమాజ సేవ చేసిన దళిత నాయకులకు ప్రతిష్టాత్మకమైన దళితరత్న అవార్డును రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అధ్యక్షతన    హైదరాబాదు లోని రవీంద్ర భారతిలో అవార్డులు ప్రధానం చేస్తారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి చేతుల మీదుగా అవార్డు గ్రహీతలు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వచ్చిన దళిత రత్న అవార్డు మా బాధ్యతలను పెంచుతుందని, భవిష్యత్తులో సమాజ సేవలో ముందుండి అనగారిన వర్గాలకు ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలను, స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను ఇంకా ఎక్కువ చేసి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలుస్తామన్నారు. అవార్డు రావడానికి కృషిచేసిన షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్, జాతీయ కార్యదర్శి సినపెల్లి కొమురయ్య జాతీయ ఉపాధ్యక్షుడు రడపాక పరంజ్యోతి రాష్ట్ర కార్యదర్శి ఎర్ర చంద్రమౌళి దళిత సంఘాల నాయకులు అందరికీ తమ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .