జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ -02(తెలంగాణ ముచ్చట్లు)

జిల్లా వ్యాప్తంగా 571 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు, 177 మునిసిపల్ వార్డుల్లో వార్డ్ సభలు విజయవంతంగా నిర్వహించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 571 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించగా, పట్టణ ప్రాంతాల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో 60, వైరా మున్సిపాలిటీలో 20, కల్లూరులో 20, మధిరలో 22, సత్తుపల్లిలో 23, ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డుల్లో సభలు సజావుగా నిర్వహించామని తెలిపారు.
ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సభలను రాష్ట్ర గీతంతో ప్రారంభించి, గౌరవ ముఖ్యమంత్రి వీడియో సందేశం ప్రదర్శన, వివిధ శాఖల పురోగతి వివరాలను ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. అలాగే, ప్రభుత్వ పథకాల క్రింద లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించడం, వారి అభిప్రాయాలను స్వీకరించడం, ప్రజా ప్రతినిధుల సందేశాలు వినిపించడం వంటి అన్ని అజెండా అంశాలను క్రమబద్ధంగా అమలు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 5,201 మంది ప్రజా ప్రతినిధులు, 4,585 మంది అధికారులు, 62,943 మంది ఇతరులు పాల్గొనగా, మొత్తం 72,814 మంది సభలకు హాజరైనట్లు తెలిపారు. సత్తుపల్లి నియోజక వర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి సత్తుపల్లి మున్సిపాలిటీ 2వ, 3వ వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ లో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామ, వార్డు సభలు ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో పారదర్శకంగా నిర్వహించబడినట్లు, ప్రజల నుండి మంచి స్పందన లభించిందని, గ్రామస్థుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా ఈ సభలు సమర్థ వేదికగా నిలుస్తాయని అదనపు కలెక్టర్ఆ ప్రకటనలో పేర్కొన్నారు.IMG-20260402-WA0163

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .