సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న జంగం శివ దంపతులు

సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న జంగం శివ దంపతులు

పెద్దమందడి,మార్చి27(తెలంగాణ ముచ్చట్లు):

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దమందడి మండలం కేంద్రంలో శ్రీ సీతారాములవారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమానికి పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు సభ్యులు శ్రీ జంగం పద్మ, జంగం శివ దంపతులు హాజరై స్వామివారికి పూజా సామాగ్రితో పాటు మంగళసూత్ర అలంకరణ మెట్టెలు (తాళిబొట్టు సామగ్రి)ను సమర్పించారు.అనంతరం వారు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.కళ్యాణం అనంతరం స్వామివార్లను దర్శించుకుని, గ్రామ ప్రజలందరికీ శాంతి, సుభిక్షాలు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .