వరల్డ్ అథ్లెటిక్స్ లెవెల్–2 కోచ్‌గా తిరుమల రావు బోరాడి అర్హత

వరల్డ్ అథ్లెటిక్స్ లెవెల్–2 కోచ్‌గా తిరుమల రావు బోరాడి అర్హత

మేడ్చల్ మల్కాజ్గిరి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు)

అథ్లెటిక్స్ రంగంలో విశిష్ట గుర్తింపును సాధిస్తూ తిరుమల రావు బోరాడి వరల్డ్ అథ్లెటిక్స్ లెవెల్–2 అండర్–18 స్పెషలైజేషన్ కోచ్‌గా అర్హత పొందారు. ఇప్పటికే వరల్డ్ అథ్లెటిక్స్ లెవెల్–1 అండర్–16 కోచ్‌గా సేవలందిస్తున్న ఆయన, తాజాగా వెలువడిన ఎలిజిబిలిటీ ఫలితాల్లో లెవెల్–2 కోచ్‌గా ఎంపికై మరో మెట్టు ఎక్కారు.లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్, పోల్ వాల్ట్ వంటి జంప్స్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యంతో ఆయన ఈ అర్హతను సంపాదించారు. కోచ్‌ల విద్య మరియు ధృవీకరణ వ్యవస్థలో భాగంగా నిర్వహించే ఈ పరీక్షలు ప్రపంచ అథ్లెటిక్స్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య మరియు ఆసియా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి.ఈ ధృవీకరణ విధానంలో లెవెల్–1, లెవెల్–2, లెవెల్–3 వంటి మూడు స్థాయిలు ఉండగా, ప్రతి దశలో సిద్దాంతపరమైన పరీక్షలు, ప్రాక్టికల్ మూల్యాంకనం, ఇంటర్వ్యూలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. లెవెల్–1 కోచ్‌గా స్ప్రింట్స్, మిడిల్ & లాంగ్ డిస్టెన్స్, జంప్స్ & త్రోస్, రిలే మరియు రేస్‌వాక్ విభాగాల్లో తిరుమల రావు ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్నారు.ఇప్పుడు లెవెల్–2 అర్హతతో జాతీయ, ఆసియా మరియు ప్రపంచ స్థాయిలో అథ్లెట్లకు శిక్షణ అందించే అవకాశాలు ఆయనకు విస్తరించాయి. ఈ విజయంతో ఆయన స్వస్థలంలో ఆనంద వాతావరణం నెలకొనగా, క్రీడా వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .