వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి

వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి

వనపర్తి,మార్చి21(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి ముస్లిం సోదరులను కలిసి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.కమ్మరిమియా, అక్తర్, హరీష్ అడ్వకేట్, బాబా పాషా, మునీరు తదితరులను వారి నివాసాల్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా పరస్పర సౌహార్దంతో సమాజం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లెల్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఎం దేవన్న యాదవ్, సిరివతి సురేష్, నాగార్జున, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .