గ్రామాలకు అభివృద్ధి నిధుల మంజూరు- ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్
భీమదేవరపల్లి,మార్చి21( తెలంగాణ ముచ్చట్లు)
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి
బండి సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి కొత్తకొండ గ్రామ అభివృద్ధి పనులకు సహకారం అందించినందుకు కొత్తకొండ గ్రామ సర్పంచ్, గ్రామ పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం భీమదేవరపల్లి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తకొండ గ్రామ సర్పంచ్ రమ రమేష్, రంగయ్యపల్లి సర్పంచ్ మండల రజిని మహేష్, రసూల్ పల్లి గ్రామ సర్పంచ్ బోయిని మహేష్ మరియు గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొత్తకొండ గ్రామానికి ఈ మధ్యకాలం లో.5 హై మాస్ట్ లైట్లు. 2 బోర్లు. 15 లక్షల రూపాయల సీసీ రోడ్లు. చేయించగా, అదనంగా మే నెల బడ్జెట్‌లో మరో 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రసూల్ పల్లి మరియు రంగయ్యపల్లి గ్రామాలకు కూడా 15 లక్షల రూపాయల సీసీ రోడ్ల ఈ నెలలో వేసుకునేటట్లు సదుపాయం కల్పిస్తా అని తెలిపారు. మిగతా అభివృద్ధి పనులకు కూడా మే నెలలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ను గ్రామ సర్పంచులు మరియు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments