అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు అందజేత
ఖమ్మం బ్యూరో, మార్చి 11(తెలంగాణ ముచ్చట్లు)
చింతకాని మండలంలోని రేపల్లెవాడ గ్రామ అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలను స్థానికులు విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన కొత్తపల్లి శివ, పోతగాని పుల్లారావు కలిసి అంగన్వాడీ కేంద్రానికి పది కుర్చీలు అందించారు. చిన్నారులు అలాగే అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లిదండ్రులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఈ కుర్చీలు ఉపయోగపడతాయని వారు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానికుల సహకారంతో అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బండి శ్రీను, సామినేని శ్రీనివాస్, షేక్ ఏసోబు, వడ్డెబోయిన గోపి, మాసిబోయిన రామారావు, వడ్రానపు వెంకటేశ్వర్లు,అంగన్వాడీ టీచర్ కట్ట ఉప్పలమ్మ , బంధం యాదగిరి , బంధం గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.


Comments