కాప్రా సర్కిల్‌లో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్ట

ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అధికారుల తనిఖీలు

కాప్రా సర్కిల్‌లో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్ట

కాప్రా, మార్చి 21(తెలంగాణ ముచ్చట్లు)

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శానిటేషన్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడిషనల్ కమిషనర్ ప్రసాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పరిశీలనలు నిర్వహించారు.ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద పరిశుభ్రత పనులను పరిశీలించి, శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గ్రీన్ వేస్ట్ నిర్వహణలో ఇబ్బందులు ఉన్నట్లుIMG-20260321-WA0097 గుర్తించిన ఆయన, రామ్‌కీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో స్వచ్ఛ ఆటోలు సేకరించే చెత్తను సమయానికి తరలించేందుకు అవసరమైన కంటైనర్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.అదేవిధంగా కుషాయిగూడ వాసవి శివనగర్ ప్రాంతంలో ప్రైవేట్ స్థలంలో డంప్ చేసిన గ్రీన్ వేస్ట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, సిబ్బంది రామకృష్ణ, శ్రీనివాస్, ఎస్.సుజాత, వసంత, రామ్‌కీ ఉప్పల్ జోనల్ ఇంచార్జ్ కృష్ణ, కాప్రా సర్కిల్ ఇంచార్జ్ నవీన్ కుమార్ రెడ్డి, సూపర్వైజర్ శృతి తదితరులు పాల్గొన్నారు.మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ ఎడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం! సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం!
ఖమ్మం బ్యూరో, మార్చి 21(తెలంగాణ ముచ్చట్లు) భారతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమైన గంగా-జమునా తెహజీబ్‌కు నిలువుటద్దంగా, మత సామరస్యానికి మకుటాయమానంగా రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం జిల్లా...
విద్యారంగానికి కేవలం 8.2% కేటాయింపు తీవ్ర అన్యాయం 
వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు 
విద్యకు న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి