పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

_ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు 

– భక్తి శ్రద్ధలతో కార్యక్రమం

కాప్రా, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు):

మీర్‌పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్‌లో ఉన్న పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ అభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చారు.ముఖ్య అతిథులను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సదానందం గుప్తా, సీహెచ్ రాజు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు సముద్రాల కృష్ణమూర్తి, బ్రహ్మచారి, తిమ్మారెడ్డి, రాజు, సురేష్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుక భక్తి వాతావరణంలో సాగి, ప్రాంత ప్రజల్లోఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించింది. IMG-20260321-WA0072

Tags:

Post Your Comments

Comments

Latest News

సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం! సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం!
ఖమ్మం బ్యూరో, మార్చి 21(తెలంగాణ ముచ్చట్లు) భారతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమైన గంగా-జమునా తెహజీబ్‌కు నిలువుటద్దంగా, మత సామరస్యానికి మకుటాయమానంగా రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం జిల్లా...
విద్యారంగానికి కేవలం 8.2% కేటాయింపు తీవ్ర అన్యాయం 
వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు 
విద్యకు న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి