రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

ముస్లిం సోదర సోదరీమణులతో కలసి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన నాయకురాలు

ఉప్పల్, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ ప్రాంతంలోని దూదేకుల సంఘం కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉప్పల్ మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులతో  కలసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన రజిత పరమేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, రంజాన్ మాసం ఆత్మశుద్ధి, సహనం, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. ఈద్ పండుగ మనుషుల మధ్య కరుణ, ఉదారత, ఐక్యత వంటి విలువలను పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి నెలకొని, సమాజంలో సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని కోరుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగూర్ భాష, అల్లా భాష పీరంబి, మల్లికార్జున్, చిన్న మస్తాన్, నబీ సాబ్, రాజమయి, వి శ్రీను, డి హుస్సేన్, ఎన్ మౌలానా, అన్వర్ భాష, అఫ్జల్ పాషా, ఖాదర్ పాషా, తుమ్మల దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, బెన్ని భీమ్సేన్, మోహన్ నాయక్, తుమ్మల రాజేందర్ రెడ్డి, గర్దాస్ వెంకటేష్, కెమిడీ శ్రీనివాస్, బడుగుల ఉపేందర్ యాదవ్, జంగారెడ్డి, అయోధ్య, ప్రశాంత్ రెడ్డి, పీరంబి, సిద్ధమ్మ, పూలమ్మ, మౌలాబి, కాసింబి, రాజ్యలక్ష్మి, పర్వీన్, బిబి తదితరులు పాల్గొన్నారు.IMG-20260321-WA0088

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .