వెల్టూర్ గ్రామంలో గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు

వెల్టూర్ గ్రామంలో గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు

పెద్దమందడి,మార్చి11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో పశువుల ఆరోగ్య రక్షణ కోసం గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది గ్రామంలోని రైతుల గేదెల వద్దకే వెళ్లి టీకాలు వేసి సేవలు అందించారు.గాలికుంటు వ్యాధి పశువుల్లో త్వరగా వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధి కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ టీకాలు వేయడం ఎంతో ముఖ్యమని పశువైద్య సిబ్బంది రైతులకు తెలిపారు.గ్రామంలోని పలు రైతుల గేదెలకు టీకాలు వేసి పశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ పాల్గొని పశువైద్య సిబ్బందితో కలిసి రైతులను ప్రోత్సహించారు.పశువుల ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని సర్పంచ్ అశోక్ అన్నారు. ప్రతి రైతు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించుకోవాలని సూచించారు.గ్రామంలో పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని రైతులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ప్రేమ్ సాగర్, పెద్ద శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .