మంగంపల్లి అంగన్వాడీ కేంద్రంలో స్వయం పరిపాలన దినోత్సవం

మంగంపల్లి అంగన్వాడీ కేంద్రంలో స్వయం పరిపాలన దినోత్సవం

పెద్దమందడి,మార్చి11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి అంగన్వాడీ కేంద్రంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.చిన్నారుల మేధో వికాసం, నైపుణ్యాల అభివృద్ధి మరియు వారి ప్రగతిని అంచనా వేసేందుకు ప్రతి సంవత్సరం ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారులు వివిధ విద్యా కార్యక్రమాలు, ఆటలు, పాటలు, కథలు చెప్పడం వంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వారి అభ్యాస స్థాయిని పరిశీలించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.అంగన్వాడీ ఉపాధ్యాయులు పిల్లలకు సంవత్సరం పొడవునా అందించిన విద్య, పోషణ, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై తల్లిదండ్రులకు వివరించారు.పిల్లల మేధో వికాసం, సామాజిక నైపుణ్యాలు, సృజనాత్మకత ఎలా అభివృద్ధి చెందాయో ప్రదర్శనల ద్వారా చూపించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనన్య, శ్రావణి, జానకి, అక్షయ, రిషి, శ్రీనుష్, ఈశాంత్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే తల్లిదండ్రులు, గ్రామస్థులు కూడా హాజరై చిన్నారులను ప్రోత్సహించారు.ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని అంగన్వాడీ నిర్వాహకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .