"కావూరి సాంబశివరావు" రాజకీయాల్లో, వ్యాపార రంగంలో మచ్చలేని నాయకుడు 

కావూరి మృతి పట్ల మాజీ ఎంపీ నామ తీవ్ర దిగ్భ్రాంతి

ఖమ్మం బ్యూరో, మార్చి 11(తెలంగాణ ముచ్చట్లు)

బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తన చిన్న మామయ్య అయిన మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎంపీ నామ ఉద్వేగానికి లోనయ్యారు. ఇటీవల నామ కావూరిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. త్వరగా కోలుకుంటారని భావించిన సమయంలో ఇలా జరగడం ఎంతో బాధాకరమని నామ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు, తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు. రాజకీయాల్లో, వ్యాపార రంగంలో ఎంతో అనుభవం గడించిన వ్యక్తి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి ,రాజకీయాల్లో, వ్యాపారాల్లో మచ్చలేని నాయకుడే కాక కావూరి నామకు బంధుత్వాల్లో పెద్ద దిక్కుగా ఉండేవారని తెలిపారు.

రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి కూడా కావూరి ప్రజా సేవకు అంకితభావంతో పనిచేసిన అనుభవజ్ఞుడైన నాయకుడని, ఐదుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై, ఒకసారి కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ప్రజా సమస్యలను ధైర్యంగా ప్రస్తావిస్తూ దేశాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. తన దగ్గరకు సహాయం కోరి వచ్చిన ఎందరికో తన వంతు సహాయ సహకారాలు అందించారని, అంతే కాకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన నిరంతరం పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందటంతో పాటు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న నాయకుడిగా కావూరి నిలిచారని నామ తెలిపారు. పారిశ్రామిక రంగం, మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో కూడా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందన్నారు. వ్యాపార, రాజకీయాల్లో ఆయన అనుభవం, దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యం అనేక మందికి మార్గదర్శకంగా నిలిచిందని వెల్లడించారు.

కావూరి సాంబశివరావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మరియు అభిమానులకు నామ నాగేశ్వరరావు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని నామ ఉద్ఘాటించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు): భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత...
ఏడాది పూర్తి చేసుకున్న పెద్దమందడి ప్రెస్ క్లబ్
మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి 
మల్కాజిగిరిలో నేడు మహిళా జన్ సున్వాయ్
ఉత్తమ ఎంఈఓగా రాజేశ్వరరావుకు అవార్డు.!
వేం నరేందర్ రెడ్డికి ఉప్పల్ కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే బండారి