వేం నరేందర్ రెడ్డికి ఉప్పల్ కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
ఉప్పల్, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
సీఎం సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఈ సమావేశం జరిగింది.ఉప్పల్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేం నరేందర్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజయ్య గుప్తా, చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, బజార్ జగన్నాథ్ గౌడ్, తెల్కల మోహన్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, తుమ్మల దేవి రెడ్డి, డిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments