సాయి కృష్ణ నగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

సాయి కృష్ణ నగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గంలోని వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాయి కృష్ణ నగర్ కాలనీలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు తదితర అభివృద్ధి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ బాలకృష్ణ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .