హెచ్ఎంటి నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

హెచ్ఎంటి నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

_సుమారు 70 మంది మహిళలకు సన్మానం

– మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

నాచారం, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కాలనీలోని సుమారు 70 మంది మహిళలను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మహిళల సేవలను గుర్తిస్తూ వారికి జ్ఞాపికలు, బహుమతులను మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతి రంగంలోనూ మహిళలు ముందుకు వచ్చి విశేష విజయాలు సాధిస్తున్నారని అన్నారు.మహిళలకు సమాజంలో మరింత గౌరవం, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అనంతరం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ముఖ్య అతిథులు, కాలనీ మహిళలు మరియు స్థానికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రావూఫ్ సార్, శ్రీనివాస్, మధు, స్వామి రాజు, వెలన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .