"వేదన కాదు ఘర్జన"

IMG-20260310-WA0077కుల కట్టుబాట్లతో ప్రేమని చంపారు,ఇక చాలు,ప్రేమికుల రక్తం తడవని నేల కావాలి,
మత విద్వేషాలతో మమతని చంపారు,ఇక చాలు,మనుషుల ఉనికిని కాపాడే చదువు కావాలి,
కార్మికుడి చెమటని దోచుకోవడమే రాజకీయపు కీర్తి అన్నారు,ఇక చాలు,అట్టడుగువాడి చేతిని పట్టిలేపే నాయకత్వపు స్పూర్తి కావాలి,
ఆడపిల్ల కప్పుకోవడమే దేశప్రకృతి అన్నారు,ఇక చాలు,స్వేచ్ఛని సమానంగా పంచుకునే ప్రగతి కావాలి. 

పేగులు కాలినచోటే కడుపు నిండాలి,
కన్నీళ్ళు రాలినచోటే ఆశ మొలకెత్తాలి,
పుర్రె పగిలినచోటే పరిమళం వెదజల్లాలి ,
పారాణి పారినచోటే పద్మము వికసించాలి.

ఆఖరిగా,చివరాఖరిగా ధ్వంసమైనచోటే స్వేచ్ఛ ఉదయించాలి.
ఇది వేదన కాదు ఘర్జన.

✍️విజయ్ కర్నాటి

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .