అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల మహిళా సమావేశం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల మహిళా సమావేశం

వేలేరు, మార్చ్ 09 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక, ఏపీఎం శ్రీమతి అనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు బిల్లా యాదగిరి హాజరై మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అనేక పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో వివో భవనాలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, మండల సమైక్య కార్యదర్శి రాజమ్మ, కార్యవర్గ సభ్యులు, సీసీలు, వివిధ గ్రామాల వివో అధ్యక్షులు, కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260309-WA0272.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .