అనారోగ్యంతో పోరాడుతున్న  సభ్యునికి టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) అండ

ఆర్థిక సహాయం అందించిన నాయకత్వం 

అనారోగ్యంతో పోరాడుతున్న  సభ్యునికి టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) అండ

ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 27(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (హెచ్–2843) ఖమ్మం జిల్లా కమిటీ తమ సభ్యుని సంక్షేమం విషయంలో మానవత్వాన్ని చాటుకుంది. తీవ్ర అనారోగ్యంతో ఖమ్మం నగరంలోని కార్తీక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మర్కారపు (బస్టాండ్) రమేష్‌ను జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్ ఆధ్వర్యంలో నాయకులు పరామర్శించి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. సభ్యుల కష్టసుఖాల్లో తోడుగా నిలవడం తమ కర్తవ్యమని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, యూనియన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వైద్యుల నుంచి రమేష్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్న నాయకులు, మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. అవసరమైన పరీక్షలు, చికిత్సలు సమగ్రంగా చేపట్టి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమమే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (హెచ్ - 2843) ధ్యేయమని, అత్యవసర సమయంలో సంఘం అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ, ఈసీ సభ్యులు ఓరుగంటి కిరణ్, లింగాల రామ్మూర్తి,IMG-20260227-WA0048 కొణతాలపల్లి నాగేశ్వర రావు, టీబీజేఎ జిల్లా కోశాధికారి కాసోజు శ్రీధర్, నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, పట్టణ కార్యదర్శి కప్పల మధు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఐక్యతను చాటుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .