డివిజన్‌లో అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పర్యటన

డివిజన్‌లో అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పర్యటన

వినాయక నగర్, ఫిబ్రవరి 26 (తెలంగాణ ముచ్చట్లు)

మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక నగర్ డివిజన్ పరిధిలో కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.వినాయక్ నగర్ లైన్ నెంబర్–17లో డ్రైనేజీ సమస్య కారణంగా రోడ్డుకు అంతరాయం కలిగిన విషయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి, వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.అలాగే రేణుక నగర్‌లో బాక్స్ డ్రైన్ పనులు పూర్తయ్యినప్పటికీ వాటర్ లైన్ పనులు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడి నేడు నుంచే వాటర్ లైన్ పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.అనంతరం జేక్ కాలనీలో నూతనంగా జరుగుతున్న రోడ్ పనులను పరిశీలించి, పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా పనులు జరగాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, కాలనీ వాసులు, బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, సాయి సురేష్, జగదీష్ చారి తదితరులు పాల్గొన్నారు.IMG-20260226-WA0021

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .