కుమ్మెరలో కుల వివక్ష దాడి – నిందితుల అరెస్టుకు డిమాండ్

నత్తి సుధాకర్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు 

కుమ్మెరలో కుల వివక్ష దాడి – నిందితుల అరెస్టుకు డిమాండ్

వనపర్తి,ఫిబ్రవరి22(తెలంగాణ ముచ్చట్లు):

నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు నెలల పసికందుపై జరిగిన అమానుష దాడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బి.సి., ఎస్.సి., ఎస్.టి. జె.ఏ.సి మరియు వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు నత్తి సుధాకర్ మహారాజ్ ఆదివారం ఒక ప్రకటనలో స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కుల వివక్ష ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. భూస్వామ్య అగ్రకులానికి చెందిన వ్యక్తులు చాకలి కులానికి చెందిన వారు ప్రశ్నించడంతో మూకుమ్మడిగా దాడి చేసి గంటల తరబడి హింసకు పాల్పడటం దారుణమని విమర్శించారు. కులం పేరుతో అవమానాలు చేయడం, హింసకు దిగడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.ఇటీవల జెండాలు పట్టుకొని శోభాయాత్రలు నిర్వహించిన వారు, ఇటువంటి ఘటనలపై నిరసనలకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. బహుజన, దళిత, గిరిజన, మైనారిటీ యువత ధైర్యంగా ముందుకు వచ్చి అన్యాయాలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. కుల అహంకారంతో జరిగిన ఈ దాడిలో గాయపడిన కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.బాధితులకు అండగా నిలవాల్సిన రక్షణ వ్యవస్థ నిందితులకు వత్తాసు పలుకుతూ, బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలను వెలికితీయాలని, ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తమై నిరసనలు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు
కలకాలం కలిసి ఉండాలి...
వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి!
ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.
రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!
ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం