రాష్ట్ర స్థాయిలో మెరిసిన వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ 

కాంస్య పతకం సొంతం

రాష్ట్ర స్థాయిలో మెరిసిన వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ 

వేలేరు, ఫిబ్రవరి 21 : (తెలంగాణ ముచ్చట్లు)

 సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ వేదికగా గత మూడు రోజులుగా నిర్వహించిన 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచి ఓపెన్ క్యాటగిరీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
రాష్ట్రం నలుమూలల నుండి పాల్గొన్న ప్రతిభావంతులైన పోలీస్ క్రీడాకారులతో కఠిన పోటీ మధ్య తన శక్తి, సామర్థ్యం, పట్టుదలతో పోరాడి విజయం సాధించడం విశేషం. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలో సేవలందిస్తూ, క్రీడలలోనూ తన సత్తా చాటడం ద్వారా సురేష్ కుమార్ వేలేరు మండలానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ విజయంతో వేలేరు పోలీస్ స్టేషన్ ప్రతిష్ట మరింత పెరిగింది. సహచర అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికప్రజలు ఆయనను ఘనంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.IMG-20260221-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .