నాగారంలో పోకిరిగాళ్ల ఆగడాలు 

నాగారంలో పోకిరిగాళ్ల ఆగడాలు 

_మాజీ ఎంపీపీ ముప్పు రామిరెడ్డిని ఢీకొట్టిన మైనర్లు 
– ఒకరు అదుపులో, ఇద్దరు పరారీలో

కీసర, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ జిల్లా లో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో మళ్లీ పోకిరిగాళ్ల ఆగడాలు చోటు చేసుకున్నాయి. మోటార్ సైకిళ్లపై అతి వేగంగా సర్కస్ పీట్లు వేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు కీసర మండల మాజీ ఎంపీపీ ముప్పు రామిరెడ్డిని ఢీకొట్టిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.సమాచారం మేరకు, రోడ్డు పై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ వచ్చిన మైనర్లు అదుపు తప్పి రామిరెడ్డిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం జరిగింది.అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
ఘటన అనంతరం ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల కుషాయిగూడలో జరిగిన ఇలాంటి ఘటన మరువకముందే నాగారంలో మళ్లీ మైనర్లు వాహనాలతో రోడ్లపై హల్‌చల్ చేయడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .