పైథాన్ శిక్షణకు ప్రాధాన్యం.!

సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం.

పైథాన్ శిక్షణకు ప్రాధాన్యం.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):

మండల పరిధిలోని బి గంగారం, సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అన్ని ఇంజనీరింగ్‌ బ్రాంచీల విద్యార్థినీ, విద్యార్థులకు పైథాన్‌పై నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ శిక్షణ ఫిబ్రవరి 5న ప్రారంభమైంది. ఈ శిక్షణా కార్యక్రమానికి ట్రైనర్లుగా డాక్టర్ షేక్ రసూల్ (అసోసియేట్ ప్రొఫెసర్, ఈసీఈ, సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాల, సికింద్రాబాద్), డాక్టర్ కె. విజయ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీఈ, అమృత విశ్వ విద్యాపీఠం, అమరావతి), డాక్టర్ యస్. రాజ్‌కుమార్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, అమృత విశ్వ విద్యాపీఠం, అమరావతి), తాటికొండ నాగ సాయి (స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, అమృత విశ్వ విద్యాపీఠం, అమరావతి)లు విద్యార్థులకు పైథాన్‌పై ప్రాయోగిక అవగాహన కల్పించారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు అవసరమైన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు పెంపొందించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల్లో అవకాశాలు సాధించేందుకు పైథాన్ కీలకంగా మారుతోందని వివరించారు. కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను ఉద్యోగ రంగానికి అనుసంధానం చేయగలగాలని సూచించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యం మరింత పెరుగుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ, పైథాన్ ఒక బహుళ ప్రయోజనాలున్న ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ భాషగా వివిధ రంగాల్లో విస్తరిస్తోందన్నారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచే ఇలాంటి ప్రత్యేక శిక్షణ అందించడం వల్ల విద్యార్థులు ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, సాయిస్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ డాక్టర్ బండి పార్ధసారథి రెడ్డి వర్చువల్‌గా పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల మొదటి సంవత్సరం విభాగాధిపతి, సైన్స్ & హ్యూమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ షేక్ మీరాసాహెబ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు, సైన్స్ & హ్యూమానిటీస్ విభాగం అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20260207-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .