బీఆర్‌ఎస్‌నే తెలంగాణకు భరోసా.!
ఆలోచించి ఓటు వేయాలి. - సోయం వీరభద్రం.
అశ్వరావుపేట, ఫిబ్రవరి 6 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ శ్రేణులు జోరు చూపాయి. 14వ వార్డు చైర్‌పర్సన్ అభ్యర్థి భుక్య ఉదయజ్యోతి గెలుపును లక్ష్యంగా చేసుకొని జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు సోయం వీరభద్రం ఆధ్వర్యంలో వార్డు పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గులాబీ జెండాలతో వీధివీధిన పార్టీ కార్యకర్తలు కదం తొక్కారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్‌ఎస్ పార్టీనే భరోసాగా నిలిచిందన్నారు. అధికార ఆశతో కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్‌కు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార నిమిత్తం అశ్వరావుపేటకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ మెచ్చాతో పాటు కొమ్ముగూడెం సర్పంచ్ సోయం సత్యవతి, పార్కెలగండి సర్పంచ్ కొమరం సుశీల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఉప్పలపాటి వెంకటరమణ, రావు జోగేశ్వరరావు, కోర్సా వెంకటేష్, బాషా తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.


Comments