ప్రజల స్వరం నిశ్శబ్దమైతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది

దయానంద్ ముదిరాజ్

ప్రజల స్వరం నిశ్శబ్దమైతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది

వనపర్తి,ఫిబ్రవరి6(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజల స్వరం నిశ్శబ్దమైతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని స్వతంత్ర శాసనసభ్య అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వనపర్తి పట్టణంలోని ఐదవ వార్డులో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి.టి. శ్యామ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా దయానంద్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నిరుపేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం మానవ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ సమస్యలు, అన్యాయంగా ఆక్రమణకు గురవుతున్న భూములపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల హక్కుల కోసం నిలబడుతున్న వ్యక్తిగా జి.టి. శ్యామ్ నేడు ఐదవ వార్డు నుంచి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారని పేర్కొన్నారు.మున్సిపాలిటీలో ప్రజల సమస్యలపై ప్రజల గొంతుగా నిలబడేందుకు ముందుకు వస్తున్న ఇలాంటి నాయకులకు సామాజికవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ సహకరించాలని కోరారు. వార్డు సమస్యల నివారణ, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే అభ్యర్థిని గెలిపించాలంటే గాలిచల్లని యంత్రం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఎన్నికలు, పార్టీలు ఏవైనా సరే ప్రజలు ఆత్మాభిమానంతో, చైతన్యంతో నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని దయానంద్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .