పెబ్బేరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెబ్బేరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం

పెబ్బేరు,ఫిబ్రవరి6(తెలంగాణ ముచ్చట్లు):

జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పెబ్బేరు మున్సిపాలిటీలోని 12 వార్డులకు సంబంధించి 12 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులే గెలుస్తారని, తద్వారా పెబ్బేరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అహంకారుల మాటలు ప్రజలు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెబ్బేరు పట్టణంలోని ఒకటవ, రెండో, మూడో, నాలుగో, ఐదో, ఆరవ వార్డులలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటవ వార్డు అభ్యర్థి కుసుమ, రెండో వార్డు అభ్యర్థి సుమిత్ర, మూడో వార్డు అభ్యర్థి వెంకటరమణ, నాలుగో వార్డు అభ్యర్థి జములమ్మ, ఐదో వార్డు అభ్యర్థి భాగ్యలక్ష్మి శివ, ఆరవ వార్డు అభ్యర్థి తాటికొండ కృష్ణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి తో కలిసి అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.వారు మాట్లాడుతూ.. పెబ్బేరు పట్టణంలోని ముప్పై ఎకరాల సంత స్థలాన్ని కబ్జా చేసి విలువైన భూమిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన ఓ మాజీ మంత్రి నేడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.పెబ్బేరు పట్టణంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధి చేయలేదని, ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలోకి వచ్చిన తరువాత కేవలం రెండేళ్లలోనే పెబ్బేరు మున్సిపాలిటీలో 54 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయని పేర్కొన్నారు.అవినీతిపరుల మోసపూరిత మాటలను నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తేనే పెబ్బేరు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షులు వెంకట్రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీలత, రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, గంధం రాజశేఖర్, సురేందర్ గౌడ్, రామచంద్ర రెడ్డి, సాయిచరణ్ రెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి, యుగేందర్ రెడ్డి, యాపర్ల రాంరెడ్డి, గుమ్మడం వెంకటరామిరెడ్డి, శ్రీహరి రాజు, రాజశేఖర్ రెడ్డి, పట్టణ మాజీ కౌన్సిలర్లు, మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాలోని ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఏర్పాటు చేసిన ఏదులాపురం మునిసిపాలిటీ...
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ 
మున్సిపల్ ఎన్నికలు: ఫిబ్రవరి 11న స్థానిక సెలవు
నేడు..కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోగుల ఆది 
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. 
సత్తుపల్లి 14వ వార్డులో ప్రజల మనిషిగా కూసంపూడి మహేష్.