శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ తో కలిసి విస్తృత బస్తీబాట కార్యక్రమం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్

శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ తో కలిసి విస్తృత బస్తీబాట కార్యక్రమం

మల్లాపూర్, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ శక్తిసాయి నగర్ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ తెలిపారు. శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ స్పందనతో కలిసి కాలనీలలో విస్తృత పర్యటన నిర్వహించారు.శక్తిసాయి నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీ, మీనా నగర్ ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రోడ్డు, డ్రైనేజీ సమస్యలపై కాలనీ పెద్దలతో కలిసి నెమలి అనిల్ కుమార్ ‘బస్తీబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ పర్యటనలో స్పందించిన మల్లాపూర్ ఏఈ స్పందనతో పాటు ఆయన బృందం కాలనీల్లో పర్యటించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి, త్వరలోనే పనులు చేపడతామని అధికారులు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు నాయకులు పి. వీరస్వామి, కోయలకొండ రాజేష్, విజయ్ రెడ్డి, అన్వర్, రామ్మూర్తి గౌడ్, ప్రతాప్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .