వెల్టూర్ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగే సౌకర్యం

ఎమ్మెల్యే మేఘా రెడ్డికి గ్రామ ప్రజల తరఫున వడ్డే శేఖర్ కృతజ్ఞతలు

వెల్టూర్ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగే సౌకర్యం

పెద్దమందడి,జనవరి22(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సమీపంలో ఎక్స్‌ప్రెస్ రిక్వెస్ట్ బస్సులు ఆగే సౌకర్యం కల్పించాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్  సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపై స్పందించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి విషయం తీసుకెళ్లారు.దీని ఫలితంగా బస్టాప్ మంజూరు కాకపోయినా, ప్రయాణికుల సౌకర్యార్థం నేటి నుండి ఎక్స్‌ప్రెస్ బస్సులు వెల్టూర్ వద్ద ఆగనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల వెల్టూర్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ప్రయాణంలో ఎంతో సౌలభ్యం కలుగనుందని వడ్డె శేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా వడ్డే శేఖర్ మాట్లాడుతూ..ఈ చర్య ప్రయాణికులకు సౌకర్యార్థంగా ఉండటంతో పాటు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు.సమస్యను సానుకూలంగా పరిగణించి పరిష్కరించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామం మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, నాగమణి నరేష్, వార్డు సభ్యులు నాగభూషణ్, నాగరాజు గౌడ్, వివేక్, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు రమేష్ ,గుండెల ఆంజనేయులు, మిల్లర్ రాజు, పాముల రాములు, కొండన్న, కావలి వెంకటయ్య, దయ్యాల రమేష్, మల్లయ్య, శ్యాంసుందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.IMG-20260122-WA0053

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .