జె.జె. నగర్‌లో రూ.1.36 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభం
నేరేడ్‌మెట్, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు)
నేరేడ్‌మెట్ డివిజన్‌లోని జె.జె. నగర్ రోడ్ నెం.6లో రూ.18 లక్షల కార్పొరేటర్ నిధులతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులను కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం జె.జె. నగర్ మెయిన్ రోడ్ నుంచి సైనిక్‌పురి మెయిన్ రోడ్ వరకు రూ.1.18 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్‌సీసీ వర్షపు నీటి నిల్వ నివారణ కాలువ (డ్రెయినేజ్ లైన్) పనులను కూడా ప్రారంభించారు. వర్షాకాలంలో ప్రతి ఏడాది ఈ ప్రధాన రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్న పరిస్థితి ఉండేదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు.గతంలోనే ఈ డ్రెయినేజ్ కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించగా, అవి మంజూరు కావడంతో ప్రస్తుతం పనులు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, రమేష్ గౌడ్, సత్యనారాయణ, శర్మ, పరాస్ జైన్, రాజి రెడ్డి, రఘురాం రెడ్డి, మోహన్, శ్యామ్, దినేష్, నాగరాజు, అకారం సాయి, అగర్వాల్, నవీన్, శాంతా రావు, ధనలక్ష్మి, ప్రమీల, ఇంద్రమ్మ, పద్మజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. స్థానికులు అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Comments