ఎస్‌బీటీఈటీ డిప్లొమా ఫలితాల్లో సాయిస్ఫూర్తి అటానమస్ కళాశాలకు జిల్లా స్థాయి అగ్రస్థానం.
సత్తుపల్లి, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఎస్‌బీటీఈటీ హైదరాబాద్ నిర్వహించిన డిప్లొమా మొదటి, రెండవ, మూడవ సంవత్సరం సెమిస్టర్/ఫైనల్ పరీక్షల ఫలితాల్లో బి.గంగారం గ్రామంలో సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా విభాగం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాల మరోసారి ప్రథమ స్థానంలో నిలిచిందని కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.
*మొదటి సంవత్సరం ఫలితాలు.*
డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో శీలం భరత్ రెడ్డి (9.63 ఎస్‌జీపీఏ), సయ్యద్ నజీర్ పాషా (9 ఎస్‌జీపీఏ), గోదా యస్వంత్ (8.69 ఎస్‌జీపీఏ) ఉత్తమ ఫలితాలు సాధించారు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మిద్దె కృష్ణప్రియ (9.38), బూరుగు రాజేష్ (9.06), షేక్ వసీం (8.75) మెరిశారు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో పెంటికల నావధీర్ 9.19 ఎస్‌జీపీఏతో ప్రతిభ చూపారు.
*రెండవ సంవత్సరం ఫలితాలు*
డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పాలోజు గీతశ్రీ 9.83 ఎస్‌జీపీఏతో అగ్రస్థానంలో నిలవగా, మిద్దె భవిత (9.5), కంచర్ల కోమలి (8.98), బైరెడ్డి శివాని (8.98) ఉత్తమ ఫలితాలు సాధించారు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో విశ్వనాధుని యస్వంత్ (9.29), కకనబోయిన హేమంత్ సాయి (8.63), రావూరి ఆదిత్య (8.52) మెరిశారు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో తాటి అభిషేక్ రాజా వర్ధన్ రావు 9.5 ఎస్‌జీపీఏ సాధించగా, కీర్తి కిషోర్ సాయి చరణ్ 7.65 ఎస్‌జీపీఏ సాధించారు.
*మూడవ సంవత్సరం ఫలితాలు*
డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో గజేంద్రుల సంకీర్తన (8.98), వాకాడని భవ్యశ్రీ (8.74), వినుకొండ హేమ ఉదయ్ కుమార్ రాజు (8.61) ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం మీద పలువురు విద్యార్థులు 9కు పైగా ఎస్‌జీపీఏ సాధించగా, కళాశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
అభినందనలు తెలిపిన యాజమాన్యం
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యుడు మరియు సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్ రియాలిటీ సిస్టమ్ ద్వారా విద్యార్థులను అభినందించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి, డిప్లొమా డీన్ తోమండ్రు రాంబాబు, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.


Comments