ఘనంగా కన్యకా పరమేశ్వరి ఆత్మర్పణ దినోత్సవం

ఈసీఎల్ క్రాస్ రోడ్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలు – అన్నప్రసాద వితరణ

ఘనంగా కన్యకా పరమేశ్వరి ఆత్మర్పణ దినోత్సవం

కాప్రా, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):

వాసవి మిత్ర మండలి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవాన్ని మంగళవారం కాప్రా నియోజకవర్గ పరిధిలోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాయిబాబా మందిరంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్త హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వేలాదిమంది ఆర్యవైశ్య ఆడపడుచులతో నిర్వహించనున్న శ్రీ కన్యకా పరమేశ్వరి పారాయణ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆర్యవైశ్య బిడ్డ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.అన్నదాన కార్యక్రమానికి ఉప్పల అరుణ శ్రీనివాసులు గుప్త సంపూర్ణ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఇంచార్జ్ రేబెల్లి శ్రీనివాస్ గుప్తా, వాసవి మిత్ర మండలి సభ్యులు పెద్ది నాగరాజు గుప్తా, రామిణి తిరుమలేష్ గుప్తా, గంప కృష్ణ గుప్తా, నంగునూరి అశోక్ గుప్తా, రాయల శ్రవణ్ గుప్తా, చెన్న చక్రపాణి గుప్తా, అమర కృష్ణ గుప్తా, తాటి శ్రీనివాస్ గుప్తా, మిరియాల అరుణ్ కుమార్ గుప్తా, జూపూడి ప్రసాద్ గుప్తా, ఎనిశెట్టి రమేష్ గుప్తా, పెద్ది నవీన్ గుప్తా, భగవాన్ గుప్తాIMG-20260120-WA0023 ఉప్పల ఆంజనేయులు గుప్తా, విబివి కృష్ణ గుప్తా, కోడూరి లక్ష్మణరావు గుప్తా, దిడిగం కైలాసం గుప్తా, చంద్రగిరి తారకేశ్వర్ గుప్తా, తాళ్లపెళ్లి అశోక్ గుప్తా, ఇరుకుల శ్రీనివాస్ గుప్తా, పడకంటి శివ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్. బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్.
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు): దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...
కల్లూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాగమయి సుడిగాలి పర్యటన.!
గిడుగు రామ్మూర్తి పంతులు 86వ వర్ధంతి చిత్రపటానికి పూలమాల
అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం
మానవత్వమే “ఫాదర్ జెరోమ్" మార్గం
బైరీ నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి