సురక్షితంగా చేరుకుందాం – రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి
పెద్దమందడి,జనవరి21(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఎస్సై జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ, ఫోర్ వీలర్ వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాల్సిందేనని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయిన ఓ తల్లి తన ఆవేదనను మీడియాకు వెల్లడిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎన్నో కుటుంబాలు కాపాడబడతాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిమరొకరికి రాకూడదని, అందరూ కూడా రోడ్డుపై జాగ్రత్తలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఆ తల్లి వేడుకొంది.ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments