సత్తుపల్లి ఏరియా ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్‌గా బిజ్ఞా కోటేశ్వర్ రావు నియామకం.
సత్తుపల్లి, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి ఏరియా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్‌గా బిజ్ఞా కోటేశ్వర్ రావును నియమించారు. ఈ మేరకు ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, సత్తుపల్లి ఏరియాలో ఐఎన్‌టీయూసీని మరింత బలోపేతం చేసి, కార్మికుల హక్కుల సాధనలో చురుకైన పాత్ర పోషించాలని కోటేశ్వర్ రావుకు సూచించారు. ప్రతి కార్మికుడి సమస్యను యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని తెలిపారు.
వైస్ ప్రెసిడెంట్‌గా నియామకమైన సందర్భంగా కోటేశ్వర్ రావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన యూనియన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడు డా. జి. సంజీవ రెడ్డి, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ రజాక్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, భద్రతా ప్రమాణాల మెరుగుదల కోసం ఐఎన్‌టీయూసీ తరఫున నిరంతరం పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.


Comments